: సిడ్నీలో పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఆసీస్ బ్యాట్స్ మన్
పాకిస్థాన్ బౌలర్లకు ఆసీస్ బ్యాట్స్ మన్ చుక్కలు చూపిస్తున్నారు. ఆసీస్ టూర్ లో ఉన్న పాకిస్థాన్ జట్టుతో ఆసీస్ జట్టు చివరి టెస్టు ఆడుతోంది. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సిరీస్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిడ్నీలో ప్రారంభమైన చివరి టెస్టులో ఆసీస్ ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. రెహాన్ షా (167), డేవిడ్ వార్నర్ (113) ఇద్దరూ సెంచరీలతో రాణించడంతో ఆసీస్ జట్టు భారీ స్కోరు దిశగా సాగిపోతోంది.
14 ఏళ్ల తరువాత ఇద్దరు ఓపెనర్లూ ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం విశేషం. 2002లో ఆసీస్ ఓపెనర్లు జస్టిన్ లాంగర్-మాథ్యూ హేడెన్ సెంచరీలు చేయడం విశేషం. కాగా, డేవిడ్ వార్నర్ ఈ టెస్టుతో తొలిటెస్టు తొలిరోజు లంచ్ విరామానికి ముందు సెంచరీ సాధించిన ఐదో ఆసీస్ ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. సుమారు 70 ఏళ్ల తరువాత ఈ ఘనత సాధించడం విశేషం. వార్నర్ కేవలం 78 బంతుల్లో తన కెరీర్ లో 18వ సెంచరీ సాధించడం విశేషం.