: మసూద్ అజార్ విషయంలో చైనాతో మంతనాలు జరుపుతున్నాం: రాజ్ నాథ్
జైషే మొహమ్మద్ చీఫ్, పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనాతో మంతనాలు జరుపుతున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయానికి అన్ని దేశాలు మద్దతు పలకగా, చైనా మాత్రం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. మరోవైపు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్ కు రప్పించేందుకు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేశామని చెప్పారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీలో తలెత్తిన విభేదాలపై స్పందిస్తూ... తండ్రీకుమారుల మధ్య తగవులాట మంచిది కాదని హితవు పలికారు.