: ఇంకా ఏం చేయాలి?: నోట్ల రద్దు తరువాతి పరిస్థితులపై మంత్రులను రివ్యూకు పిలిచిన మోదీ
నోట్ల రద్దు నిర్ణయం తరువాత దేశంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల సమస్యలను తీర్చేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై సమీక్షించేందుకు తనతో సమావేశం కావాలని తన మంత్రివర్గ సహచరులకు ప్రధాని నరేంద్ర మోదీ సమాచారాన్ని పంపారు. ఈ మేరకు సాయంత్రం సమావేశం జరగనున్నట్టు ప్రధాని మోదీ కార్యాలయం నుంచి మంత్రులకు ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న మోదీ, సాయంత్రం ఢిల్లీకి వెళ్లగానే మంత్రులతో సమావేశం కానున్నారని కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు. ఆపై కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. నోట్ల రద్దు చూపిన ప్రభావం, వృద్ధి రేటు తగ్గిన రంగాల ప్రోత్సాహం, కేంద్ర కార్యదర్శుల స్థాయిలో ఏర్పాటైన 10 కమిటీల పనితీరు తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.