: ఊపిరితిత్తులు పూర్తిగా పాడవడమే జయలలిత మరణానికి కారణం.. వెలుగులోకి వచ్చిన గవర్నర్ లేఖ!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో డిసెంబర్ 5న కన్నుమూయగా, ఇప్పటికీ ఆమె మరణానికి కారణాలపై అనుమానాలు, సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7న, అంటే, జయ చనిపోయిన తరువాత రెండు రోజులకు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు జయలలిత మరణానికి గల కారణాలపై రాసిన లేఖ ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 4న తాను ముంబైలో ఉండగా, జయలలిత ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించినట్టు సమాచారం అందిందని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని తాను సూచించానని, ఎక్మో విధానంలో శ్వాస అందించినప్పటికీ, ఊపిరితిత్తులు పూర్తిగా పాడవడమే ఆమె మృతికి కారణమైందని తెలిపారు. మొదట్లో ఆమె ఆరోగ్యం మెరుగు పడిందని, కోలుకున్న తరువాత తిరిగి ఆరోగ్యం మందగించిందని వెల్లడించారు.