: జనవరి 31 నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నట్టు తెలుస్తోంది. జనవరి 31న లోక్ సభ, రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించనున్నారు. ఇప్పటి వరకు సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ ను విడివిడిగా ప్రవేశపెట్టేవారు. అయితే, ఈ సారి రెండింటినీ కలిపి ఒకే బడ్జెట్ గా ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ లో ఒక చాప్టర్ గా రైల్వే బడ్జెట్ వుంటుంది. ఇప్పటి వరకు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో జరిగేవి. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తుతుండటంతో... బడ్జెట్ సమావేశాలను ఒక నెల ముందుకు జరిపారు. దీనివల్ల ఆర్థిక సంవత్సరం ఆరంభం (ఏప్రిల్ 1) నుంచే బడ్జెట్ అంశాలను అమల్లోకి తీసుకురావచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.