: పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకల్లో ఆలస్యం.. కొన్ని రద్దు !


పొగమంచు కారణంగా 55 రైళ్లు ఆలస్యంగా బయలుదేరుతుండగా, మరో 22 రైళ్లను రీ షెడ్యూల్ చేయగా, ఆరు రైళ్లను రద్దు చేశారు. రేపు బయలుదేరాల్సిన మరో రెండు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు రద్దయిన రైళ్లలో న్యూఢిల్లీ-హౌరా పూరవ్ ఎక్స్ ప్రెస్, న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్, అమృత్ సర్-హౌరా మెయిల్, జోథ్ పూర్-వారణాసి మరుధర్ ఎక్స్ ప్రెస్, ఢిల్లీ జంక్షన్-అజమ్ ఘర్ కైఫితా ఎక్స్ ప్రెస్, వారణాసి-న్యూఢిల్లీ కాశీవిశ్వనాథ్ ఎక్స్ ప్రెస్ లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News