: మా తల్లీ తండ్రీ నువ్వే... కోటి వేల జేగుర్లు పెట్టుకుంటున్నాం: పవన్ తో ఇద్దివానిపాలెం మహిళ


జనసేనాని ముందు శ్రీకాకుళం జిల్లా ఇద్దివానిపాలెం గ్రామం నుంచి వచ్చిన ఓ మహిళ, తన గ్రామపు దీనగాథను కళ్లకు కట్టేలా వివరించింది. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామంలోని వారందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాలేదని వాపోయింది. "పేద ప్రజలం. మత్స్యకులం మాది. సంద్రానికి వెళ్లితే బిడ్డా పాపలకు మందులు పోయించుకోలేక చాలా అవస్థ అయిపోతున్నాం. మొన్న పదిహేను దినాల కింద వచ్చారు. కల్యాణ్ బాబు దగ్గరకు మీరందరు కూడా వెళ్లాలని చెప్పినారు. చెప్పి, ఇవాళ ఉదయం బస్సు పంపించారు.

ఇద్దివానిపాలెం గ్రామస్థులం, చాలా జనం వచ్చాం. కిడ్నీ రోగానికి నాలుగైదు సంవత్సరాలుగా మందులు వాడుతున్నాం. బాధలు భరించలేక చాలా అవస్థై పోతున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయనగారొచ్చి రమ్మన్నారు అనేసరికి సంతోషించి అందరమూ కూడా వచ్చున్నాం. ఈ యాద భరించలేము. నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నా. ఆయనే తల్లీ తండ్రీ, తోడూ నీడ. సర్వం అతనే అనుకుంటూ, అందరం కూడా వచ్చాం. అతనికి కోటి వేల జేగుర్లు పెట్టుకుంటున్నాం. అతనే దేవుడనేసి భావించేస్తూ ఉన్నాం. ఇది నా ప్రార్థన" అని తన బాధను ఆమె నేలపై కూర్చుని చెబుతుంటే, పవన్ కూడా కింద కూర్చుని విన్నారు.

  • Loading...

More Telugu News