: ప్రముఖ రచయిత, సాహితీవేత్త కాకాని చక్రపాణి కన్నుమూత.. నేడు అంత్యక్రియలు
కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ రచయిత, సాహితీవేత్త కాకాని చక్రపాణి కన్నుమూశారు. హైదరాబాద్, పద్మారావునగర్‌లోని స్వగృహంలో సోమవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏప్రిల్ 26, 1942లో గుంటూరు జిల్లాలోని చినకాకానిలో జన్మించిన చక్రపాణి హైదరాబాద్‌లో చదువుకున్నారు. అక్కడే ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. 'ఫోర్ క్లాసిక్స్ ఆఫ్ తెలుగు' పేరిట ద్రవిడ విశ్వవిద్యాలయం కోసం రాజశేఖర చరిత్ర, మైదానం, చివరకు మిగిలేది, అప్పజీవి వంటి ప్రఖ్యాత రచనలను ఆంగ్లంలోకి అనువదించారు. చక్రపాణి భౌతిక కాయానికి మంగళవారం బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.