: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు హైదరాబాదులో ఇంటి స్థలం కేటాయింపు
రియో ఒలింపిక్స్ రజత పతక విజేత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. హైదరాబాద్ లోని షేక్ పేట లో ఉన్న భరణి లే అవుట్ లో 1000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రియో ఒలింపిక్స్ పతక విజేత అయిన సింధుకు, ఇంటి స్థలం కేటాయిస్తామని సీఎం కేసీఆర్ నాడు ప్రకటించారు.