: కులాభిమానంతోనే రెడ్లు జగన్ వైపు వెళ్లారు... చంద్రబాబే సమర్థుడు: జేసీ


ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థతను చూసే తాను తెలుగుదేశం పార్టీలో చేరానని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి విషయంలో చంద్రబాబును మించిన వారు లేరని కొనియాడారు. రాయలసీమను రతనాలసీమగా మార్చడంలో చంద్రబాబు సఫలమవుతారని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకోవడం వైసీపీ అధినేత జగన్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. కులం కూడు పెట్టదని... కులపిచ్చిని జనాలు విడనాడాలని పిలుపునిచ్చారు. కేవలం కులాభిమానంతోనే రెడ్లంతా జగన్ వెంట నడిచారని... అంతకు మించి మరే కారణం లేదని అన్నారు. కులాలను పక్కన పెట్టి, అభివృద్ధిని చూసి ఓటు వేయడం నేర్చుకోవాలని సూచించారు. 2019లో కూడా చంద్రబాబును గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి సంపూర్ణమవుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News