: గూగుల్ ప్లే స్టోర్ లో రికార్డులు బద్దలు కొడుతున్న భీమ్


భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'భీమ్' యాప్ దుమ్ము రేపుతోంది. గూగుల్ ప్లే స్టోర్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఎంతో ప్రజాదరణ పొందిన మై జియో, మెసెంజర్, వాట్సాప్, ఫేస్ బుక్ లను తలదన్ని... అత్యధికంగా డౌన్ లోడ్ అవుతోంది. డిసెంబర్ 30న లాంచ్ అయిన భీమ్... ప్లే స్టోర్ లో నెంబర్ వన్ ప్లేస్ సాధించింది. భీమ్ డౌన్ లోడ్స్ సంఖ్య 23 లక్షలకు చేరుకున్నాయి. భీమ్ ఇంత ఘన విజయం సాధించడం పట్ల ఆధార్ మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News