: 8 ఆలయాలను ఉచితంగా దర్శించుకునే... 'దివ్యదర్శన' కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు
పేద హిందువులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా కానుక అందించింది. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలను పేద హిందువులు దర్శించుకునేందుకు 'దివ్య దర్శన' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 8 ప్రముఖ ఆలయాలను ఉచితంగా దర్శించుకోవచ్చు. ఐదు రోజుల పాటు ఈ దివ్యదర్శన యాత్ర కొనసాగుతుంది.