: కేసీఆర్‌ను ప్ర‌శంస‌ల‌లో ముంచెత్తిన గ‌వ‌ర్న‌ర్‌.. ఇలాంటి సీఎంను తానెప్పుడూ చూడ‌లేద‌ని వ్యాఖ్య‌


తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావుపై తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ నర‌సింహ‌న్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుందనుకుంటే ఎవ‌రినుంచైనా స‌ల‌హాలు స్వీక‌రించే ఇటువంటి ముఖ్య‌మంత్రిని తానెప్పుడూ చూడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఏదైనా ఆలోచ‌న వ‌చ్చిందంటే ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా దానిని అమ‌లు చేసే వ‌ర‌కు ఆయ‌న విశ్ర‌మించ‌ర‌ని అన్నారు.

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఆదివారం ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు గ‌వ‌ర్న‌ర్‌ను కలిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి  సాధిస్తుంద‌ని, నెంబ‌ర్ వ‌న్‌గా నిలుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.  ఐటీశాఖా మంత్రి కేటీఆర్‌పైనా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని నంబ‌ర్ వ‌న్‌గా నిలిపార‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News