: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు ఆర్‌బీఐ నుంచి రాని సమాధానం


పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యానికి ముందు జ‌రిగిన ప‌లు అంశాల వివ‌రాల‌పై సమాచార హక్కు చట్టాన్ని ఉప‌యోగిస్తూ ఓ వ్యక్తి ఆర్‌బీఐని అడిగిన‌ ప్ర‌శ్న‌కు స‌మాధానం రాలేదు. ఆయన అడిగిన ప్రశ్న ఆ చట్టం పరిధిలోకి రాదని స్ప‌ష్టం చేసిన ఆర్‌బీఐ.. ఆ వ్య‌క్తి కోరిన సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని కూడా చెప్పింది. ఇంత‌కూ ఆ వ్య‌క్తి ఏ విష‌యాన్ని అడిగాడ‌న్న విష‌యాన్ని చూస్తే.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే ముందు ఆర్థిక‌శాఖ ప్రధాన సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యంనుగానీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీగానీ ఆర్‌బీఐని సంప్రదించిందా? అని అడిగాడు.

కేంద్ర ఆర్థిక శాఖ త‌మ వ్యూహాలను వివరించిందో.. లేదో చెప్పాల‌ని కోరాడు. దీంతో ఆర్‌బీఐ అందుకు నిరాక‌రించింది. ఈ ప్ర‌శ్న‌ల‌ను అడిగిన స‌ద‌రు వ్యక్తి ఆ ప్ర‌శ్న‌ల లేఖ‌ను ఆర్‌బీఐతో పాటు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా పంపించాడు. అయితే, ఈ రెండింటి నుంచి కూడా స‌ర‌యిన‌ సమాధానం రాలేదు.

  • Loading...

More Telugu News