: ఇండియాపై ఐరాసలో ఫిర్యాదు చేయనున్న పాకిస్థాన్
తమ దేశంపై గూఢచర్యం చేస్తున్నారంటూ భారత్ పై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయాలని పాక్ నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా భారత జలాంతర్గామి తమ జలాల్లోకి వచ్చి గూఢచర్యం చేసిందని ఐరాసలో పాక్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధి ఫిర్యాదు చేయనున్నారని పాక్ వెల్లడించింది. ఈ మేరకు రేపు ఐరాస ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న గుటేర్స్ కు లోధీ ఫిర్యాదును అధికారికంగా అందిస్తారని సమాచారం. కాగా, నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ ను 2016 ప్రారంభంలో అరెస్ట్ చేసిన పాక్, తమ దేశంలో ఇండియా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.