: ఇస్తాంబుల్ న్యూ ఇయర్ పార్టీపై ఉగ్రదాడి... 35 మంది మృతి


టర్కీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్ లో ఉగ్రదాడి జరిగింది. న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ, శాంతాక్లజ్ వేషంలో వచ్చిన ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 35 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు అధికారులు ప్రకటించారు. మరణించిన వారి మృతదేహాలతో న్యూ ఇయర్ పార్టీ భీతావహంగా కనిపిస్తోంది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు. ఉగ్రదాడిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News