: సర్జనులకు సర్కారు మిత్రుడు .. దుష్టులకు శత్రువు!: మోదీ
సర్కార్ సజ్జనోంకీ మిత్ర్ హే, దుర్జనోకీ శత్రు హే (సర్జనులకు సర్కారు మిత్రుడు .. దుష్టులకు శత్రువు) అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జాతినుద్దేశించి ఆయన మాట్లాడుతూ, బ్యాంకింగ్ వ్యవస్థ సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నానని అన్నారు. గత కొన్నేళ్లుగా 500, 1000 రూపాయల నోట్లు సమాంతర వ్యవస్థగా మారాయన్నారు. బ్యాంకుల స్వేచ్ఛను గౌరవిస్తున్నానని చెప్పిన ఆయన, బ్యాంకు ఉద్యోగులు పేద, దిగువ మధ్యతరగతి ప్రజల సేవలే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకుల్లో డబ్బు చేరిందని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు, నక్సలైట్లు నల్లధనంపై ఆధారపడి ఉన్నారని ఆయన చెప్పారు. బ్యాంకులకు స్వర్ణయుగం వచ్చిందని, దానిని సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు నిజాయతీగా పని చేస్తారని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు.