: పీకలదాకా తాగి... విమానం నడపడానికి వచ్చాడు!


సాధారణంగా ఎవరైనా తప్పతాగితే ఏదో ఒక మూల కూర్చొని నిద్రపోతారు. నిద్ర రాకపోతే చుట్టుపక్కల ఉన్నవారితో గొడవకు దిగుతారు. కానీ ఇండోనేసియాలో ఓ పైలట్ మాత్రం విమానం నడపడానికి వచ్చాడు. కనీసం నిలబడేందుకు కూడా కంట్రోల్ లో లేని విధంగా ఫుల్లుగా తాగేసిన కెప్టెన్ టెకాద్ పూర్ణ తూలుతూ విమానంలోకి ప్రవేశించి, అనౌన్స్ మెంట్ కు ముందే పొంతన లేకుండా మాట్లాడడం ఆరంభించాడు.

దీంతో బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు విమానాశ్రయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విమానాన్ని ఆపిన అధికారులు అతను విమానాశ్రయంలోకి ప్రవేశించిన పుటేజ్ చూసి ఆందోళనకు గురయ్యారు. అందులో అతని ప్రవర్తన కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, విమానం ఆయన నడిపి ఉంటే ఏం జరిగి ఉండేదోనన్న ఆందోళన రేకెత్తించింది. దీంతో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఎయిర్ పోర్టుకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు రాజీనామా చేశారు. సోషల్ మీడియాలో అతను ఎయిర్ పోర్టులోకి ప్రవేశించిన వీడియో వైరల్ అవుతోంది. మీరు కూడా చూసి కడుపుబ్బనవ్వండి.

  • Loading...

More Telugu News