: సోమిరెడ్డి బెదిరింపులు, బ్లాక్ మెయిల్ కు భయపడేది లేదు: వైసీపీ ఎమ్మెల్యే కాకాని


టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర ఫోర్జరీ పత్రాలు తయారు చేసే ముఠా ఉందేమో చెప్పాలని వైఎస్సార్సీపీ నేత కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్రంలోని పోలీసులను ఆశ్రయించడం ద్వారా కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి మనీ ల్యాండరింగ్, ఆర్థిక అవకతవకల కేసుల్లో నిజానిజాలు నిర్ధారించాల్సింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లేదా ఐటీ శాఖలని అన్నారు.

వాటిని ఆశ్రయించకుండా స్థానిక పోలీసులను ఆశ్రయించడంలో సోమిరెడ్డి ఆంతర్యమేంటని అన్నారు. దీనిని బట్టి చూస్తే, ఇప్పటి నుంచే ఆ కేసులను తప్పుదోవపట్టించే చర్యలు ప్రారంభించారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షంపై విమర్శ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏదో ఒక మంత్రి పదవి ఇస్తారని సోమిరెడ్డి భావిస్తున్నారని, అందుకే అవసరమున్నా లేకున్నా పోలీసు స్టేషన్లకు వెళ్లి, ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News