: ఇతర క్యాబ్ ల డ్రైవర్లను అడ్డుకుంటున్న ‘ఓలా’, ‘క్యాబ్’ డ్రైవర్లు!
తమ డిమాండ్లు పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో ‘ఓలా’, ‘ఉబర్’ సంస్థల డ్రైవర్లు బంద్ పాటిస్తున్నారు. తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు జరుగుతున్న ఈ బంద్ వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే, బంద్ పాటిస్తున్న సదరు సంస్థల డ్రైవర్లు ఇతర క్యాబ్ లను కూడా అడ్డుకుంటున్నారు. బంద్ లో పాల్గొనని క్యాబ్ ల డ్రైవర్లను, ప్రయాణికులను ఆయా వాహనాల్లో నుంచి బలవంతంగా కిందకు దించేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్, ఐడీపీఎల్, సుచిత్ర తదితర ప్రాంతాల్లో ఇదే తీరు కొనసాగుతోంది.