: మావోల రెక్కీపై సమాచారం లేదు.. అవసరమైతే చంద్రబాబుకు భద్రత పెంచుతాం: ఏపీ డీజీపీ


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మావోయిస్టులు టార్గెట్ చేశారని... ఆయన ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు మావోలు రెక్కీ కూడా నిర్వహించారని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ఏపీ భవన్ పరిసరాల్లో పలుమార్లు మావోలు తచ్చాడారని తెలిపారు. మీడియా ముసుగులో చంద్రబాబుపై దాడి జరిగే అవకాశం ఉందని ఢిల్లీ ఇంటలిజెన్స్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ స్పందించారు. మావోయిస్టుల రెక్కీపై తమకు ఎలాంటి సమాచారం లేదని డీజీపీ సాంబశివరావు తెలిపారు. ముఖ్యమంత్రి భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంటామని... అవసరమైతే భద్రతను పెంచుతామని చెప్పారు. ఇటీవల ఏవోబీలో ఎన్ కౌంటర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసిందని... ఈ నేపథ్యంలో, సీఎంకు భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఇప్పటికే మావోయిస్టు కార్యకలాపాలను చాలా వరకు నియంత్రించేశామని... వేల సంఖ్యలో ఉన్న మావోలు వందల సంఖ్యకు వచ్చేశారని చెప్పారు. 

  • Loading...

More Telugu News