: బాంబులతో దద్దరిల్లిన బాగ్దాద్... 19 మంది దుర్మరణం
ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి రక్తమోడింది. నిత్యం రద్దీగా ఉండే సెంట్రల్ బాగ్దాద్ మార్కెట్ ప్రాంతంలో ఈ రోజు రెండు శక్తిమంతమైన బాంబులు పేలాయి. ఈ దారుణ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. ఆల్-సైనిక్ ప్రాంతంలో ఉన్న దుకాణాల వద్ద ఈ బాంబు పేలుళ్లు జరిగాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ రెండు పేలుళ్లలో ఒకటి ఆత్మాహుతి దాడి అని చెప్పారు. అయితే, ఈ దాడులకు బాధ్యులుగా ఇంతవరకు ఎవరూ ప్రకటించుకోలేదు. ఇరాక్ లో అంతర్యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో... అక్టోబర్ 17 నుంచి బాగ్దాద్ లో హైఅలర్ట్ అమల్లో ఉంది.