: బీసీసీఐపై లీగల్ చర్యలకు సిద్ధమవుతున్న పీసీబీ
గత కొన్నేళ్లుగా తమతో క్రికెట్ ఆడడానికి నిరాకరిస్తున్న భారత క్రికెట్ల కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై లీగల్ చర్యలు తీసుకోవడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. దీనికి సంబంధించి త్వరలోనే న్యాయనిపుణులను కలుస్తామని పీసీబీ ఛైర్మర్ షహర్యార్ ఖాన్ తెలిపారు. బీసీసీఐపై చర్యలకు పీసీబీ ఇప్పటికే ఆమోదముద్ర వేసిందని చెప్పారు. ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటానికి 2014లో ఇరు క్రికెట్ బోర్డులు ఒప్పందం చేసుకున్నాయని... కానీ, ఆ విషయాన్ని బీసీసీఐ పక్కన పెట్టేసిందని షహర్యార్ ఖాన్ ఆరోపించారు. ఒప్పందం ప్రకారం 2015 నుంచి 2022 వరకు ఆరు సిరీస్ లు జరగాలని చెప్పారు. బీసీసీఐ నిర్ణయంతో పాక్ క్రికెట్ కు తీరని అన్యాయం జరుగుతోందని.. వందల కోట్ల రూపాయలను బోర్డు కోల్పోయిందని విమర్శించారు.