: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణా డెల్టా రైతులు


ముఖ్యమంత్రి చంద్రబాబును కృష్ణా డెల్టా రైతులు ఈ రోజు సచివాలయంలో కలిశారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో రైతులంతా ర్యాలీగా వచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించి, ఈ ఏడాది తమ పంటలను కాపాడారని ఈ సందర్భంగా చంద్రబాబుకు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తాము పండించిన తొలి ధాన్యాన్ని చంద్రబాబుకు అందజేశారు. రైతులతో చంద్రబాబు కాసేపు సరదాగా గడిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని... అన్ని ప్రాంతాల రైతులను ఆదుకోవడం తమ లక్ష్యమని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. 

  • Loading...

More Telugu News