: ఏ తండ్రీ తన కొడుకుకు హాని చేయడు!: ములాయం సింగ్ కీలక వ్యాఖ్య


యూపీ సీఎం, తన కుమారుడు అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుంచి బర్తరఫ్ చేసిన సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ తండ్రి కూడా తన కుమారుడికి హాని చేయాలని భావించడని (కోయీ బాప్ అప్నే బేటే కా నుక్సాన్ నహీ చాహతా) అన్నారు. తన కుమారుడు అఖిలేష్ భవిష్యత్తును రాం గోపాల్ నాశనం చేస్తున్నారని, కుమారుడిపైనే చర్యలు తీసుకోక తప్పనిసరి పరిస్థితిని తీసుకొచ్చారని ములాయం ఆరోపించారు. తన కుమారుడు తన మాట వినే స్థాయిని దాటి పోయాడని అన్నారు. కాగా, మరికాసేపట్లో ములాయం తన మద్దతుదారులతోనూ, అసెంబ్లీకి తాను ప్రకటించిన అభ్యర్థులతోను సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News