: నేనే సీఎంను... ములాయం, శివపాల్ ఇళ్లకు సెక్యూరిటీ పెంచండి: అఖిలేష్ యాదవ్
సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ ఇంటిముందు సెక్యూరిటీని మరింతగా పెంచాలని, ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా చర్యలు చేపట్టాలని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ పోలీసు అధికారులను ఆదేశించారు. లక్నోలోని 5, కాళిదాస్ మార్గ్ లో ఉంటున్న ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ములాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత భారీ ఎత్తున అఖిలేష్ ఇంటికి చేరుకున్న అభిమానులు ములాయం వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు ములాయం ఇంటి వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని అఖిలేష్ ఆదేశించారు. ఇదే సమయంలో తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, రాష్ట్రానికి తానే సీఎంనని, నిన్నటికీ, నేటికీ పరిస్థితి మారలేదని అన్నారు.