: అశోక్ గ‌జ‌ప‌తి రాజు భ‌య‌ప‌డి మంచం కింద దాక్కుంటే.. రివాల్వ‌ర్ బ‌య‌ట‌కు తీసి ర‌క్షించా..!: జానారెడ్డి


శుక్ర‌వారం జ‌రిగిన బీఏసీ స‌మావేశంలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూశాయి. తాను టీడీపీలో ఉన్నప్ప‌టి రోజుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుర్తుచేసుకుంటే,  ప్రాణ‌భ‌యంతో ప‌రుగులు తీసిన అశోక్ గ‌జ‌ప‌తి రాజును తానే ర‌క్షించానని జానారెడ్డి పేర్కొన్నారు. మొద‌ట కేసీఆర్ మాట్లాడుతూ.. తాను టీడీపీలో ఉన్న‌ప్పుడు జానారెడ్డి, తాను, అశోక్ గ‌జ‌ప‌తిరాజు, మ‌రికొంద‌రు నేతలం క‌లిసి ప్ర‌తిరోజు ఎవ‌రో ఒక‌రి ఇంట్లో క‌లుసుకునేవాళ్ల‌మ‌ని నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకున్నారు. అప్ప‌టి రాజ‌కీయాలే వేర‌ని ఈ సంద‌ర్భంగా ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ మాటల‌కు స్పందించిన సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. ఒక‌సారి అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. రాజీవ్ గాంధీకి వ్య‌తిరేకంగా మాట్లాడార‌ని తెలిపారు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన కాంగ్రెస్ వాళ్లు అశోక్‌పై దాడిచేయ‌డానికి వ‌స్తే ఆయ‌న మంచంకింద దాక్కున్నార‌ని పేర్కొన్నారు. అశోక్ స‌తీమ‌ణి భ‌య‌ప‌డి కేక‌లు వేయ‌డంతో తాను రివాల్వ‌ర్ బ‌య‌ట‌కు తీసి అశోక్‌ను కాపాడాన‌ని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News