: జపాన్ తూర్పు తీరంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.5
రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో జపాన్ తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. టోక్యోకు ఈశాన్యంగా 244 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. భూ ఉపరితలానికి 11 కిలోమీటర్ల లోతున ఈ కేంద్రం ఉందని తెలిపారు. భూకంప ప్రభావంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు. కాగా, భూకంపం కారణంగా ఏర్పడిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. కాగా, గత బుధవారం నాడు ఇక్కడికి సమీపంలోని డైగో అనే ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం ఏర్పడిన సంగతి తెలిసిందే.