: తక్కువ ట్రాన్సాక్షన్లను డిజిటలైజేషన్ చేయడమంత చెత్తపని ఇంకోటి లేదు: చిదంబరం
నోట్ల రద్దు వల్ల అవినీతి తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని, మరి తగ్గిందా? లేదా? తగ్గితే ఎంత తగ్గిందో వెల్లడించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థను క్యాష్ లెస్ గా మార్చడం అసాధ్యమని అన్నారు. తక్కువ విలువ కలిగిన ట్రాన్సాక్షన్లు డిజిటలైజేషన్ చేయడమంత చెత్తపని మరోటి లేదని ఆయన ఎద్దేవా చేశారు. నవంబర్ 8న మోదీ ప్రకటన కన్నా ముందే ఆర్బీఐ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని చెప్పిందని గుర్తుచేసిన ఆయన, ఆర్బీఐ మినిట్స్ ను వెంటనే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కేబినెట్ ముందుంచిన నోట్ ను కూడా బయటపెట్టాలని ఆయన కేంద్రాన్ని కోరారు.