: బెంగళూరులో ‘ఐ ఫోన్’ తయారీ సంస్థ?
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్ త్వరలో బెంగళూరులో ‘ఐఫోన్’ తయారీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ సంస్థ అసలైన పరికరాల తయారీ దారు, తైవాన్ కు చెందిన విస్ట్రాన్ బెంగళూరులోని పీన్యాలో ఐఫోన్ తయారీ ప్లాంటు స్థాపించనుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. స్థానికంగా ఐఫోన్ ఉత్పత్తి ప్రారంభమైతే వాటి ధర భారీగా తగ్గే అవకాశం ఉంటుందని సమాచారం. కాగా, యాపిల్ డిజైన్, డెవలప్ మెంట్ కు చెందిన విభాగాన్ని సైతం ఇక్కడే నెలకొల్పుతామని సంస్థ సీఈవో టిమ్ కుక్ గతంలో ఈ మేరకు హామీ ఇవ్వడం తెలిసిందే.