: అఖిలేష్ యాదవ్ ను భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించిన మద్దతుదారులు
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని నిరసన తెలిపారు. ఆ సందర్భంగా పలువురు కన్నీరు పెట్టుకున్నారు. మరికొంత మంది మద్దతుదారులు అఖిలేష్ యాదవ్ ను భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. రెండు రోజుల్లో మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు.