: ఊరికినే అడుగుతున్నా.. అమెరికాలో లక్ష్మీదేవి లేకుండానే అంత సంపన్న దేశం ఎలా అయింది?: వర్మ


ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాటలే కాదు, ట్వీట్లూ వివాదాస్పదంగానే ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా, మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘ధనానికి మూలమైన అమ్మవారు లక్ష్మీదేవి లేకుండానే అమెరికా మన కన్నా ఎంతో సంపన్న దేశము ఎలా అయింది?.. ఊరికినే అడుగుతున్నాను’ అని వర్మ తన ట్వీట్ లో ప్రశ్నించాడు. అయితే, ఈ ట్వీట్లకు నెటిజన్ల నుంచి పలు విమర్శలు వచ్చాయి. ‘ఈ తరహా ప్రశ్నలు చాలా సార్లు అడిగారు, విసుగుపుడుతోంది’ అని ఒకరు, ‘నువ్వు అమెరికాలో లేవు కాబట్టే’ అని మరొకరు స్పందించారు.

  • Loading...

More Telugu News