: లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఎంపీ రాంగోపాల్ యాదవ్ లపై సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరేళ్ల బహిష్కరణ వేటు వేయడంతో అఖిలేష్ వర్గం భగ్గుమంటోంది. ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. లేని పక్షంలో తీవ్రపరిణామాలు ఉంటాయని అఖిలేష్ యాదవ్ మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ మద్దతుదారులు భారీ సంఖ్యలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భారీగా బలగాలను మోహరించారు. అఖిలేష్ అభిమానులు అక్కడ ప్లకార్డులు, నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తిస్తున్నారు.