: అన్యాయం... నోటీసిచ్చిన అరగంటలోనే బహిష్కరించారు: అఖిలేష్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్
తమను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించడంపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ స్పందించారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ, ఇది సరైన విధానం కాదని అన్నారు. నోటీసులిచ్చిన అరగంటలోనే బహిష్కరించడం సముచితమా? అని ఆయన అడిగారు. అత్యున్నత న్యాయస్థానం కూడా వ్యతిరేకపక్షం మాటలు వినకుండా తీర్పు చెప్పదని ఆయన అన్నారు. తమకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. నేతాజీ (ములాయం)కి అన్ని విషయాలు తెలుసని, ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆయనకు పూర్తిగా అర్థం కానట్టు అనిపిస్తోందని ఆయన తెలిపారు. సుపరిపాలన అందిస్తున్న అఖిలేష్ పై బహిష్కరణ వేటు వేయడం పార్టీపై వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేస్తుందని ఆయన చెప్పారు.