: మోదీజీ, ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పండి: రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీకి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఐదు ప్రధాన ప్రశ్నలు సంధించారు. ఈ ఐదు ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
1) నవంబర్ 8 (పెద్దనోట్ల రద్దు) తరువాత ఎంత బ్లాక్ మనీ బయటపడింది?
2) భారత్ ఆర్థికంగా ఎంత నష్టపోయింది, ప్రజలు ఎన్ని ఆదాయ వనరులు కోల్పోయారు?
3) పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంత మంది మృతిచెందారు? వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందా? ఎందుకు చెల్లించలేదు?
4) పెద్ద నోట్ల రద్దుకు ముందు ప్రధాని సంప్రదించిన నిపుణులెవరు?
5) పెద్ద నోట్ల రద్దుకు రెండు నెలల ముందు నుంచి 25 లక్షల రూపాయలు, ఆ పైన బ్యాంకుల్లో డబ్బు జమచేసిన వారెవరు? .. అంటూ రాహుల్ ప్రశ్నించారు.