: ఇక్కడి విద్యార్థులకు ‘పైరేట్’ సర్టిఫికెట్ ఇస్తారు!


సముద్రపు దొంగలు.. అదే, ‘పైరేట్స్’ అనగానే మనకు గుర్తుకు వచ్చేది హాలీవుడ్ లో తెరకెక్కించిన ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్స్’ చిత్రాల సిరీస్. తుపాకులతో కాల్చడం, సెయిలింగ్ చేయడం, బాణాలు సంధించడంలో ‘పైరేట్స్’ ఆరితేరి ఉంటారు. ఇదిలా ఉండగా, విద్యార్థులను ఫిజికల్ ఎడ్యుకేషన్ వైపు మళ్లించాలని, దానిపై వారికి ఆసక్తి కల్పించాలనే ఉద్దేశ్యంతో అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భావించింది. ఆయా అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తోంది.

ఇంతకీ, ఆ సర్టిఫికెట్ కు వర్శిటీ పెట్టిన పేరేంటో తెలుసా, ‘పైరేట్’ సర్టిఫికెట్! ఫెన్సింగ్, రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, సెయిలింగ్ విద్యల్లో విద్యార్థులకు శిక్షణ నిస్తారు. ఆయా విద్యల్లో ఉత్తీర్ణులై పొందిన గ్రేడ్ ల ఆధారంగా విద్యార్థులకు ‘పైరేట్’ సర్టిఫికెట్ ను అందజేస్తారు. అయితే, ఈ సర్టిఫికెట్ సాధించాలనే విద్యార్థుల సంఖ్య గతంతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిపోయిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే, ఈ సర్టిఫికెట్లను వర్శిటీ అధికారికంగా జారీ చేయకపోవడం! 

  • Loading...

More Telugu News