: 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు'తో జతకట్టనున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్
ఇండియన్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నాడు. రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడంతో... ఇంతకాలం అసంతృప్తితో ఉన్నాడు సుశీల్. చివరకు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ)తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అక్టోబర్ లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూతో పూర్తి స్థాయి చర్చలు జరిపిన సుశీల్... తాజాగా తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు.
వచ్చే ఏడాది నవంబర్ లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈవెంట్లలో సుశీల్ పాల్గొనే అవకాశం ఉంది. ఇదే జరిగితే ది గ్రేట్ 'ఖలీ' తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈవెంట్లలో పాల్గొన్న రెండో భారత రెజ్లర్ గా సుశీల్ నిలుస్తాడు. గతంలో రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన సుశీల్ ను రియో ఒలింపిక్స్ కు దూరం పెట్టింది భారత రెజ్లింగ్ సమాఖ్య. రియోకు వెళ్లే అర్హత తనకే ఉందంటూ సుశీల్ పోరాడినా... ప్రయోజనం లేకపోయింది.