: జయంత్ యాదవ్ ఆట టెస్టులకు సరిపోదన్న స్పిన్ దిగ్గజం


ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో జయంత్ యాదవ్, కరుణ్ నాయర్ లాంటి యువ క్రికెటర్లు సత్తా చాటారు. నాయర్ ట్రిపుల్ సెంచరీతో 'ఔరా' అనిపించాడు. అటు బౌలింగ్ తో పాటు, ఇటు బ్యాటింగ్ లో కూడా అద్భుతంగా రాణించాడు జయంత్ యాదవ్. దీంతో, జయంత్ రూపంలో మంచి ఆల్ రౌండర్ దొరికాడని అందరూ భావించారు. అయితే, జయంత్ ఆట టెస్టు మ్యాచ్ లకు సరిపోదని మాజీ స్పిన్నర్ ఎర్రాపల్లి ప్రసన్న అన్నారు. జయంత్ స్పిన్ టెస్టులకు సరిపోడని... లాంగ్ స్పెల్స్ వేయలేడని చెప్పారు. అయితే, జయంత్ ఆటతీరు వన్డేలకు, టీ20లకు అతికినట్టు సరిపోతుందని అన్నారు. మరోవైపు, ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో అశ్విన్ ఒకడని... బ్యాట్స్ మెన్ ను చదవగలిగే సామర్థ్యం జడేజాకు ఉందని ప్రసన్న కితాబిచ్చారు. 

  • Loading...

More Telugu News