: చైనా కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టిన అమెరికా
అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం పరిధులు దాటింది. నకిలీ వస్తువులు తయారుచేస్తున్నాయన్న ఆరోపణతో చైనాకు చెందిన కొన్ని కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. దీనిని చైనా తీవ్రంగా పరిగణించింది. దీనిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి షెన్ డాన్ యాంగ్ మాట్లాడుతూ, అమెరికాది బాధ్యతారాహిత్యమైన చర్య అన్నారు. అమెరికా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి చైనా కంపెనీలను ‘నొటోరియస్ మార్కెట్ ప్లేసెస్‘ కంపెనీల జాబితాలో చేర్చిందని మండిపడ్డారు. మేధో సంపత్తి హక్కులపై అమెరికా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం తమకుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై అమెరికాతో చర్చిస్తున్నామని ఆయన తెలిపారు.