: నగదు రహిత లావాదేవీల్లో దేశంలోనే కృష్ణా జిల్లాకు అగ్రస్థానం
నగదు రహిత లావాదేవీల్లో దేశంలోనే కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు అవార్డు అందుకోనున్నారు. కాగా, నగదు రహిత లావాదేవీల్లో జిల్లాకు అవార్డు రావడంపై అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అన్ని జిల్లాల్లోను నగదు రహిత లావాదేవీలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.