: ఇకపై న్యూయార్క్ సిక్కు పోలీసులు అర అంగుళం మేర గడ్డం పెంచుకోవచ్చు.. టర్బన్ ధరించొచ్చు


ఇకపై న్యూయార్క్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిక్కులు అర అంగుళం మేర గడ్డం పెంచుకోవచ్చు, టర్బన్ కూడా ధరించవచ్చు. ఈ మేరకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ నిబంధనల్లో ఓ సవరణ తీసుకువచ్చింది. ఈ సవరణ ప్రకారం, న్యూయార్క్ పోలీస్ చిహ్నం ఉన్న నీలం రంగు తలపాగాను సిక్కు పోలీసులు ధరించి తమ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు, అర అంగుళం మేర వారు గడ్డం పెంచుకునే అవకాశం కూడా కల్పించింది.

ఈ సందర్భంగా న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జేమ్స్ ఓ నీల్ మాట్లాడుతూ, తాజా నిర్ణయంతో సిక్కు వర్గాల ప్రజలు న్యూయార్క్ పోలీస్ విభాగంలో చేరి మరిన్ని సేవలు అందించేందుకు అవకాశముంటుందన్నారు. కాగా, ఈ విషయమై న్యూయార్క్ లోని సిక్కు ఆఫీసర్స్ అసోసియేషన్ ట్విట్టర్ ద్వారా తమ కృతఙ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News