: మౌన దీక్షను విరమించిన కోదండరామ్


తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తన మౌన దీక్షను కొద్దిసేపటి క్రితం విరమించారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆయనతో మజ్జిగ  తాగించి, దీక్ష విరమింపజేశారు. కాగా,  భూ నిర్వాసితుల సమస్యలపై ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు వస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోదండరామ్ తన నివాసంలోనే ఈరోజు మౌనదీక్ష చేపట్టారు.
ఫార్మాసిటీ కోసం వేలాది ఎకరాలు సేకరిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా భూ సేకరణ చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతులు కోరుకుంటున్న భూ సేకరణ యాక్ట్ తీసుకురావాలని, మల్లన్నసాగర్ రైతులతో చర్చలు జరపాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News