: ప్రియుడి ఇంటి నుంచి శ్రద్ధాకపూర్ ను బయటకు లాక్కొచ్చిన తండ్రి?


బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ కూతురు, ప్రముఖ నటి శ్రద్ధాకపూర్ ప్రేమ వ్యవహారంపై బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ తో ప్రేమలో పడిన శ్రద్ధాకపూర్, అతని నివాసానికే తన మకాం కూడా మార్చేసిందట. ఈ విషయం తెలుసుకున్న శక్తికపూర్, వెంటనే ఫర్హాన్ నివాసానికి వెళ్లి తన కూతురిని బయటకు లాక్కొచ్చేశాడట. ఆ తర్వాత ఆమెను వాళ్ల ఇంటికి శక్తికపూర్ తీసుకువెళ్లాడట.

శ్రద్ధ, ఫర్హాన్ ల ప్రేమ వ్యవహారం శక్తికపూర్ దంపతులకు నచ్చకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని, ఫర్హాన్ కు గతంలో పెళ్లి అయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని అంటున్నారు. అయితే,  తన భార్య అయిన అధూనా అక్తర్ కు ఫర్హాన్ విడాకులిచ్చేసి, శ్రద్ధాకపూర్ తో సన్నిహితంగా ఉంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలను శ్రద్ధా-ఫర్హాన్ జంట ఖండిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News