: ఏపీ మంత్రి నారాయణ సన్నిహితుడు డాక్టర్ గుణశేఖర్ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
ఏపీ మంత్రి నారాయణకు సన్నిహితుడైన డాక్టర్ గుణశేఖర్ యాదవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. తిరుపతిలోని ఆయన నివాసంలో గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సుమారు 400 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించినట్టు సమాచారం. అయితే, ఈ వివరాలను సంబంధిత శాఖాధికారులు గోప్యంగా ఉంచారు. కాగా, మంత్రి నారాయణకు గుణశేఖర్ బినామీగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.