: ముంబైలో ప‌ట్టాలు తప్పిన లోకల్ రైలు.. ప్ర‌మాదం నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డిన ప్ర‌యాణికులు


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ స‌మీపంలో నిన్న ఓ రైలు ప‌ట్టాలు త‌ప్పిన ఘ‌ట‌న‌ను మ‌ర్చిపోక‌ముందే మ‌హారాష్ట్ర‌లో మ‌రో రైలు ప‌ట్టాలు తప్పింది. అయితే ప్ర‌యాణికులు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. గురువారం తెల్ల‌వారుజామున 5:30 గంట‌ల స‌మ‌యంలో క‌ల్యాణ్‌-విఠల్‌వాడి మ‌ధ్య కుర్ల‌-అంబ‌ర్‌నాథ్ లోక‌ల్ రైలు ప్ర‌మాదానికి గురైంది. ఐదు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాక‌పోవ‌డంతో రైల్వే అధికారులు  ఊపిరి పీల్చుకున్నారు.  ప్ర‌మాదం కార‌ణంగా ఈ మార్గంలో రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.

  • Loading...

More Telugu News