: లష్కరేపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా రెడీ.. ఆ సంస్థ విద్యార్థి విభాగాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అగ్రరాజ్యం
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆ సంస్థ విద్యార్థి విభాగం అల్ మహ్మదీయను కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. తద్వారా లష్కరే తోయిబా కార్యకలాపాలను అడ్డుకోవడంతోపాటు ఆ సంస్థ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
భారత్‌పై కుట్రలు చేస్తూ దేశాన్ని అస్థిరపరిచేందుకు పాక్ కేంద్రంగా 1987లో హఫీజ్ సయీద్ లష్కరే తోయిబాను స్థాపించాడు. 2001లో పార్లమెంట్‌పైన, 2008లో ముంబైపైన దాడికి పాల్పడింది లష్కరే తోయిబానే. లష్కరే చీఫ్ హఫీజ్ తలకు అమెరికా వెల కట్టినా, అతడు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని తెలిసినా అమెరికా ఇన్నాళ్లూ చూసీచూడనట్టుగా వ్యవహరించింది. అయితే మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్ననేపథ్యంలో ఇక ఉగ్రవాద సంస్థల పని ఖతమేనని లష్కరే తోయిబా బాధిత దేశాలు భావిస్తున్నాయి.