: వ్యవసాయ భూములను ఆక్వా చెరువులుగా మారుస్తోంది టీడీపీ నాయకులే!: సీపీఎం


వ్యవసాయ భూములను ఆక్వా చెరువులుగా మారుస్తున్న వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర భూస్వాములు ముందు వరుసలో ఉన్నారని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు.  వరి సాగులో వలే ఆక్వా చెరువుల్లో పని దొరకక వ్యవసాయ కూలీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని మధు ఆందోళన వ్యక్తం చేశారు. తలసరి ఆదాయం, వృద్ధి రేటు పెంపు పేరుతో చట్టాలకు అతీతంగా ఆక్వా సాగును ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వమేనని  విమర్శించారు. గోదావరి జిల్లాల్లోని చేపలు, రొయ్యల చెరువుల్లో అక్రమ తవ్వకాలను నివారించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News