: కామన్వెల్త్ ఉమన్ పార్లమెంటేరియన్స్ సభ్యురాలిగా ఎంపీ కవిత


నిజామాబాద్ ఎంపీ కవితను కామన్వెల్త్ ఉమన్ పార్లమెంటేరియన్స్ (సీడబ్ల్యూపీ) సభ్యురాలిగా నామినేట్ చేశారు.  ఈ మేరకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూపీ సభ్యురాలిగా మూడేళ్లపాటు ఆమె కొనసాగనున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సీడబ్ల్యూపీ సభ్యురాలిగా తనను నామినేట్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మహిళా సాధికారతకు తన వంతు కృషి చేస్తానని కవిత చెప్పారు.

  • Loading...

More Telugu News