: ఇందులో, చంద్రబాబు గొప్పతనమేమీ లేదు: వైఎస్సార్సీపీ నేత భూమన
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే పోలవరం ప్రాజెక్టుకు నిధులు వస్తున్నాయని, ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు గొప్పతనం ఏమీ లేదని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీ అభివృద్ధికి విపక్షాలే అడ్డుపడుతున్నాయనే చంద్రబాబు వ్యాఖ్యలు సబబు కాదని మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్షమే ఉండకూడదని, ప్రతిపక్షం లేకుంటే తన అవినీతికి అడ్డూఅదుపు ఉండదనేది ఆయన ఆలోచన అని విమర్శించారు.