: మీరు చెబుతున్నవన్నీ కాకి లెక్కలే!: చంద్రబాబుపై మండిపడ్డ బొత్స


ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీలో వృద్ధి రేటు పెరిగిందంటూ చంద్రబాబు చెబుతున్నవన్నీ కాకి లెక్కలేనని విమర్శించారు. ఇలాంటి తప్పుడు గణాంకాల వల్ల రాష్ట్రం వెనుకబడిపోతుందని అన్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని... ప్రజలను ఆయన ఎందుకు మోసం చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.

పక్కా ఆధారాలతోనే తాము వృద్ధి రేటు గణాంకాలను బయటపెట్టామని... మేం చెప్పినవి అవాస్తవాలని చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఉన్న పరిశ్రమలే మూతపడుతుంటూ... కొత్త పరిశ్రమలు వచ్చాయని చెప్పడం ఎంత వరకు సబబని అన్నారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కనీసం ఒక్క శాతం పెట్టుబడి అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బొత్స పైవ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News